HYD: రహదారిపై పొంగుతున్న డ్రైనేజీ.. ఈ రూట్‌లో ట్రాఫిక్ ఆంక్షలు, అటువైపు వెళ్లకండి

1 year ago 31
హైదరాబాద్‌ మలక్‌పేట రైల్వే బ్రిడ్జి-మూసారాంబాగ్‌ మార్గంలో పది రోజులుగా డ్రైనేజీ నీరు రోడ్డుపై ప్రవహిస్తూ తీవ్ర ట్రాఫిక్‌కు కారణమవుతోంది. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయి. జలమండలి అధికారులు తాజాగా మరమ్మతు పనులు చేపట్టారు. చాదర్‌ఘాట్-దిల్‌సుఖ్‌నగర్‌ వైపు వెళ్లేవారు నల్గొండ ఎక్స్ రోడ్డు కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. విజయవాడ హైవే నుంచి వచ్చే RTC, ప్రైవేటు బస్సులను ఉప్పల్ మీదుగా, MGBS, కోఠి నుంచి వచ్చే బస్సులను కాచిగూడ మీదుగా మళ్లిస్తున్నారు. పనులు పూర్తయ్యే వరకు సహకరించాలని పోలీసులు కోరుతున్నారు.
Read Entire Article