హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో మరో భూమ్ రాబోతుందని మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్‌రెడ్డి వెల్లడించారు. క్రెడాయ్ తెలంగాణ సదస్సు 2024 ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు హాజరై మాట్లాడారు. స్థిరాస్తి వ్యాపారులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందిస్తుందన్నారు. ఫ్యూచర్ సిటీ ఏర్పాటుతో ఆ ప్రాంతం గణనీయమైన అభివృద్ధిని సాధిస్తుందని చెప్పారు.