ప్రముఖ పారిశ్రామికవేత్త వెలమాటి చంద్రశేఖర జనార్ధనరావును మనవడే హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆస్తి కోసం ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు నిర్ధారించారు. డ్రగ్స్‌కు బానిసైన మనవడు కీర్తితేజ.. ఆస్తి కోసం దారుణానికి ఒడిగట్టినట్లు గుర్తించారు. కాగా, వెలమాటి తన సంపదలో చాలా వరకు దానాలు చేశారు. దాదాపు రూ.100 కోట్లు విరాళాలుగా అందజేశారు.