వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో స్టాక్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో అమాయకులను బురిడీ కొట్టిస్తూ సైబర్ నేరగాళ్లు కోట్లు గడిస్తున్నారు. హైదరాబాద్‌లో తాజాగా ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి రూ.2.9 కోట్లు పోగొట్టుకోవడం కలకలం రేపింది. చైనీయులే ఈ మోసాల వెనుక ఉన్నారని, థాయ్‌లాండ్, కంబోడియా నుంచి నెట్‌వర్క్ నడుపుతున్నారని దర్యాప్తులో తేలింది.