హైదరాబాద్‌లోని బాచుపల్లి-మియాపూర్ రహదారిలో ట్రావెల్ బ్యాగ్‌లో కనిపించిన ఓ మహిళ మృతదేహం కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. ఈ దారుణానికి పాల్పడింది మహిళతో సహజీవనం చేస్తున్న నేపాల్ దేశస్థుడైన విజయ్ తోఫా (30) అని పోలీసులు వెల్లడించారు. గర్భం దాల్చిన మృతురాలు తారాను గర్భస్రావం చేయించుకోవాలని విజయ్ పట్టుబట్టడంతో మే 23న ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆగ్రహంతో విజయ్ ఆమెను చున్నీతో ఊపిరాడకుండా చేసి చంపేశాడు. మృతదేహాన్ని ట్రావెల్ బ్యాగులో కుక్కి నిర్మానుష్య ప్రాంతంలో పడేశాడు. బ్యాగు ఆధారంగా పోలీసులు విజయ్‌ని గుర్తించి పట్టుకున్నారు.