New Year Celebrations MMTS Services: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా హైదరాబాద్ వాసులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది. జనవరి 1 తెల్లవారుజాము వరకు లింగంపల్లి నుంచి నాంపల్లి, ఫలక్‌నుమా మార్గాల్లో ప్రత్యేక ఎంఎంటీఎస్ రైళ్లను నడపనుంది. అర్థరాత్రి రద్దీ, క్యాబ్ కొరత సమస్యలను అధిగమించి, సురక్షితంగా ఇళ్లకు చేరుకునేందుకు ఈ సేవలు ఉపయోగపడతాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను దృష్టిలో ఉంచుకుని రైలు ప్రయాణం క్షేమదాయకమని అధికారులు సూచిస్తున్నారు.