హైదరాబాద్ ఉప్పల్‌లో అమానుష ఘటన చోటుచేసుకుంది. రెండో తరగతి చదువుతున్న విద్యార్థినిపై.. అదే స్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ అబ్బాయి లైంగిక దాడికి తెగబడ్డాడు. ఈ విషయాన్ని ఆ చిన్నారి ఇంట్లో చెప్పటంతో.. ఆ తల్లిదండ్రులు స్కూల్ ఎదుట ఆందోళన నిర్వహించారు. దీంతో.. ఆ తొమ్మిదో తరగతి విద్యార్థిని స్కూల్ యాజమాన్యం వెంటనే టీసీ ఇచ్చి పంపేసింది. ఆందోళన నేపథ్యంలో.. స్కూల్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు.