Hyderabad Cycling Track: విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌కు.. స్పెషల్ అట్రాక్షన్‌గా ఉండాల్సినవి.. దుర్వినియోగం అవుతూ ఎప్పుడూ చర్చనీయాంశంగా మారుతూనే ఉంటాయి. నగరంలో సైక్లిస్టుల కోసం ఏర్పాటు చేసిన సైక్లింగ్ ట్రాక్ మరోసారి వార్తల్లో నిలిచింది. రోడ్డు ప్రమాదాలు, పశువుల జాగింగ్‌తో ఇన్నాళ్లు చర్చనీయాంశంగా మారిన సైక్లింగ్ ట్రాక్.. ఇప్పుడు ఓ సెలెబ్రిటీ చేసిన రొమాంటిక్ రీల్స్‌తో మరోసారి నెట్టింట చర్చకు తెర లేపింది. అయితే.. ఆ సెలెబ్రిటీ ఎవరో కాదు బిగ్ బాస్ ఫేం ఇనయా సుల్తానా.