హైదరాబాద్ హస్తినాపురంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు. మద్యం మత్తులో అతివేగంగా కారు నడిపిన వ్యక్తి.. స్కూటీపై వెళ్తున్న ఇద్దరు బీటెక్ విద్యార్థులతో పాటు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మరో యువకుడిని బలంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆగ్రహించిన విద్యార్థులు రోడ్డుపై ఆందోళన చేపట్టగా.. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.