హైదరాబాద్‌లో కుప్పలు తెప్పలుగా యూట్యూబర్లు ఉన్నారు. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు యూట్యూబర్లుగా, ఇన్‌ఫ్లుయెన్సర్లుగా ఫీలవుతూ.. నానా రచ్చ చేస్తున్నారు. ఎదుటివారికి ఎలాంటి ఇబ్బంది కలకుండా తమ పనేదో తాము చేసుకుంటూ వెళ్తే ఓకే కానీ.. పబ్లిక్‌లోకి వచ్చి న్యూసెన్స్ చేస్తామంటే కుదరదు కదా.. అలాంటి ఓ యూట్యూబర్ గురించి ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. రోడ్లపై నోట్లు వెదజల్లుతూ పబ్లిక్ న్యూసెన్స్ క్రియెట్ చేస్తున్న యూట్యూబర్‌పై చర్యలు తీసుకోవాలని నెట్టింట డిమాండ్ వినిపిస్తోంది.