Hyderabad: మీరు హైదరాబాద్ మొత్తం తిరిగి.. నగరంలో ఉన్న ఫేమస్ ప్రదేశాలను చూడాలనుకుంటున్నారా. హైదరాబాద్ నగరం మొత్తం ఒకేరోజులో చుట్టి రావాలని ఆలోచిస్తున్నారా. నగరం మొత్తం తిరగాలంటే జేబు ఖాళీ చేసుకోవాల్సి వస్తుందని భయపడుతున్నారా. అయితే ఇక ఆ దిగులు అవసరం లేదు. తెలంగాణ టూరిజం శాఖ ఇప్పుడు సరికొత్త టూర్ ప్యాకేజీ అందిస్తోంది. తక్కువ ధరకే.. ఒకేరోజులో హైదరాబాద్ నగరం మొత్తం తిప్పి చూపించేలా ఈ ట్రిప్‌ను తీసుకువచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.