వేర్వేరు రాష్ట్రాలకు చెందిన ఓ యువతి.. ఓ యువకుడు. ఉపాధి కోసం హైదరాబాద్ నగరానికి వచ్చారు. ఇక్కడ పనిచేసుకుంటూ యువకుడు హాస్టల్‌లో ఉంటుండగా.. యువతి స్నేహితులతో కలిసి ఓ గదిలో అద్దెకు ఉంటోంది. వీరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. చివరకు ఇదే ప్రాణాలు తీసింది. తనను దూరం పెడుతుందని భావించిన యువకుడు.. ఆమెతో గొడవపడి ఆవేశంలో కత్తి దూశాడు. ఆమె తీవ్ర గాయాలతో చనిపోవడంతో అతడు కూడా ఆత్మహత్యకు ప్రయత్నించాడు.