గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ధార్ గ్యాంగ్ భయాందోళనకు గురిచేస్తున్నారు. పగలంతా హోటల్‌కు వెళ్లి విశ్రాంతి తీసుకుని, బస్సుల్లో చోరీలు చేయడం.. లేకుంటే రాత్రి 10ది తర్వాత శివారు ప్రాంతాల్లోని కాలనీలు, బంగ్లాను టార్గెట్ చేస్తారు. దొరికినంత దోచుకొని వెళ్లిపోతుంటారు. హైదరాబాద్ నగరంలో ఈ దోపిడీ దొంగల వరుస చోరీలు తీవ్ర కలకలం రేపాయి. ఇటీవల హైదరాబాద్ నగర శివారులోని చౌటుప్పల్ వద్ద ఓ బస్సులో బంగారం చోరీకి గురయ్యింది.