ప్రముఖ స్టార్ హోటల్‌లో ఒకటి.. రెండేళ్ల నుంచి పన్ను బకాయిలు చెల్లించడం లేదు. దీనిపై అధికారులు నోటీసులు పలుసార్లు ఇచ్చారు. అయినా సరే వారి నుంచి స్పందన రాకపోవడంతో ఇక లాభం లేదనుకున్నారు. వెంటనే ఆ హోటల్ గేట్లకు తాళాలు వేసి సీజ్ చేశారు. కట్టాల్సిన బకాయి చాలా ఎక్కువగానే ఉన్నట్టు అదికారులు తెలిపారు. మరి దీనిపై నిర్వాహకులు ఎలా స్పందిస్తారో మరి.