తన సమస్య విషయమై స్టేషన్‌కు వచ్చిన మహిళపై కన్నేసిన పోలీస్.. ఆమెను వశం చేసుకోడానికి ప్లాన్ వేశాడు. ఆమెతో మాటలు కలిపి పరిచయం పెంచుకుని.. న్యాయం చేస్తానని, డబ్బులు ఇప్పించే పూచీ నాదని నమ్బబలికాడు. అయితే, ఇది నిజమే అని నమ్మిన యువతి.. అతడు చెప్పినట్టు చేసింది. ఇంటికి రప్పించి.. . పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. అతడు పెళ్లి చేసుకుంటాడని భావించిన ఆమె అతడి మాటలకు లొంగిపోయింది. పలుసార్లు అత్యాచారం చేయడంతో గర్బం దాల్చింది.