హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ప్రముఖ స్టార్ హోటల్ తాజ్ బంజారా హోటల్‌ను జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. రెండు సంవత్సరాల నుంచి నిర్వాహకులు పన్ను బకాయిలు చెల్లించకపోవడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. పలు మార్లు బకాయిలు చెల్లించాలని నోటీసులు ఇచ్చినప్పటికీ.. నిర్వాహకుల నుంచి స్పందన రాలేదని తెలిసింది. ఈ క్రమంలోనే తాజాగా అధికారులు చర్యలకు ఉపక్రమించినట్లు సమాచారం. దాదాపు రూ. 1.43 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.