మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని 23 గ్రామాలను సమీప మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో విలీనం చేసి అనంతరం వాటిని జీహెచ్‌ఎంసీలో కలిపేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ జిల్లాలో ఎక్కువ భాగం జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉంది. ఔటర్ రింగు రోడ్డుకు వెలుపలి గ్రామాలూ మున్సిపాల్టీల్లో కలవనున్నాయి. విలీన ప్రక్రియలో జిల్లా యంత్రాంగం లీనమైంది. ఓఆర్ఆర్ చుట్టూ ఉన్న చాలా గ్రామాలు వాటి సమీపంలోని మున్సిపాల్టీల్లో విలీనం చేసిన తర్వాత.. హెచ్ఎండీఏలో కలిపి రెండు కార్పొరేషన్లుగా విభజిస్తారు.