HYDRA Demolitions: హైదరాబాద్ నగరంలో హైడ్రా పేరు చెబితేనే అక్రమ నిర్మాణాలు చేసిన వారిలో భయం భయం నెలకొంది. ఎప్పుడు ఏ బుల్డోజర్ వచ్చి.. తమ ఇళ్లు, ఆఫీస్‌లను కూల్చివేస్తుందోనని జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా హైడ్రా కూల్చివేతలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సీరియస్ అయ్యారు. ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మించిన జీహెచ్ఎంసీ భవనాన్ని కూల్చేస్తారా.. నెక్లెస్ రోడ్డును తవ్వేస్తారా అని అసదుద్దీన్ ఓవైసీ.. ఫైర్ అయ్యారు.