హైదారాబాద్‌లో హైడ్రా కూల్చివేతలు జోరుగా సాగుతున్నాయి. చెరువులు, కుంటల బఫర్ జోన్లు, ఎఫ్టీఎల్ పరిధుల్లో ఎలాంటి కట్టడాలు కనిపించినా.. ఏమాత్రం ఉపేక్షించకుండా బుల్డోజర్లతో నేలమట్టం చేస్తున్నారు. ఈక్రమంలో.. పలువురు సామాన్యుల నిర్మాణాలు కూడా ఉండటం శోచనీయం. అయితే.. వాళ్లంతా బ్యాంకుల్లో రుణాలు తీసుకుని మరి సొంతింటి కలను నెరవేర్చుకున్నట్టు వాపోతుండగా.. ఈ విషయంపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సంచలన ఆదేశాలు జారీ చేసేందుకు సిద్ధమయ్యారు.