HYDRA Demolitions: హైడ్రా కూల్చివేతలు ఇప్పుడు హైదరాబాద్‌తోపాటు తెలంగాణ మొత్తం తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. కొందరు ఈ హైడ్రా కూల్చివేతలకు మద్దతుగా సీఎం రేవంత్ రెడ్డిపై పొగడ్తలు కురిపిస్తుండగా.. బాధితులు, ప్రతిపక్ష పార్టీలు మాత్రం తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. హైడ్రా కూల్చివేతలపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర విమర్శలు చేస్తుండగా.. గతంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. హైడ్రా లాంటి వ్యవస్థ గురించి అప్పుడే కేసీఆర్ మాట్లాడారని కాంగ్రెస్ కార్యకర్తలు కౌంటర్ ఇస్తున్నారు.