ఓఆర్ఆర్ పరిధిలోని భూముల వివరాలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు హైడ్రా చర్యలు చేపట్టింది. చెరువులు, ప్రభుత్వ భూములు, పార్కుల సమాచారాన్ని సేకరించేందుకు ఎన్ఆర్ఎస్సీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా విపత్తుల నిర్వహణ, నీటి వనరుల రక్షణకు జియోస్పేషియల్ డేటా మద్దతు లభిస్తుంది. చెరువుల పునరుద్ధరణ, ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోంది. పర్యావరణ హితమైన నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు హైడ్రా చర్యలు తీసుకుంటోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.