హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌పై బీజేపీ శాసనపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రంగనాథ్‌కు ప్రజాసేవపై మోజు ఉంటే ఖాకీ బట్టలు వదిలేసి.. ఖద్దరు బట్టలు వేసుకోవాలని కామెంట్ చేశారు. అక్రమ నిర్మాణాల పేరుతో హిందువుల ఇళ్లను మాత్రమే కూల్చుతున్నారంటూ ఏలేటి ఘాటు ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో హైడ్రా పేరుతో లేనిపోని హైప్‌ను సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఒవైసీ నిర్మాణాలు కూల్చిన తర్వాతే మిగతావి కూల్చాలని డిమాండ్ చేశారు.