Anumula Tirupati Reddy: హైడ్రా నోటీసులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు ఎనుముల తిరుపతి రెడ్డి స్పందించారు. అమర్ సొసైటీలో తాను నివాసం ఉంటున్న స్థలం 2015లో కొనుగోలు చేశానని.. అది దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్న సంగతి తనకు తెలియదని ఆయన అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉంటే.. ప్రభుత్వం, హైడ్రా ఎలాంటి చర్యలు తీసుకున్నా తనకు అభ్యంతరం లేదన్నారు. తిరుపతి రెడ్డి వివరణతో ఆ ఇంటిని కూల్చివేసేందుకు హైడ్రా చర్యలు తీసుకోనుందని చర్చ జరుగుతోంది.