HYDRA Demolition: హైదరాబాద్‌లో చెరువులు, కుంటలను ఆక్రమించి చేపట్టిన నిర్మాణలపై హైడ్రా బుల్డోజర్లు ప్రయోగించటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. కాగా.. హైడ్రా కూల్చివేతలపై పలు రాజకీయ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే.. కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణా రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా ఆలోచన బాగుందని.. కానీ ఆచరణలోనే లోపం ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.