HYDRA demolitionsఛ హైదరాబాద్‌లో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన హైడ్రా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు కేవలం అక్రమ నిర్మాణాలపైకే బుల్డోజర్లు ప్రయోగించిన హైడ్రా.. వాటికి అనుమతులు ఇచ్చిన అధికారుల భరతం పట్టేందుకు సిద్ధమమైంది. ఆ అధికారులపై క్రిమినల్ కేసులు కూడా పెట్టేందుకు రెడీ అయ్యింది. ఇప్పటికే.. గండిపేట, మాదాపూర్ పరిసరాల్లో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన ఆరుగురు ఉన్నతాధికారులపై కేసులు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.