District wise ministers list for independence day celebrations: ఆంధ్రప్రదేశ్‌లో స్వాతంత్య్ర దినోత్సవానికి ఏర్పాట్లు మొదలయ్యాయి. ఆగస్ట్ 15న సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో జెండా ఆవిష్కరణ చేయనున్నారు. అలాగే జిల్లా కేంద్రాల్లో మంత్రులు జెండా ఆవిష్కరణ చేయనున్నారు. ఈ మేరకు సాధారణ పరిపాలనశాఖ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే అల్లూరి జిల్లాలో మాత్రం కలెక్టర్ జెండా పండుగ వేడుకల్లో పాల్గొంటారు.