Indervelly: ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లిలో వింత జంతువు సంచరిస్తోంది అనే వార్తలు ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. సీసీటీవీలో రికార్డ్ అయిన వీడియోలు బయటికి రావడంతో అక్కడి ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఇళ్ల ముందు ఉన్న గేట్లను ఎక్కి ఆ జంతువు తిరుగుతున్నట్లు వీడియోలు వైరల్ అయ్యాయి. ఇంతకీ అది ఏ జంతువు. దీనిపై విచారణ జరిపిన అధికారులు ఏం చెప్పారు అనేది ఈ స్టోరీలో చూద్దాం.