తెలంగాణ ప్రభుత్వం రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని పకడ్బందీగా అమలు చేయడానికి 23 రోజుల కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేక అధికారులు, మండలాలకు గెజిటెడ్ అధికారులు నియమితులవుతారు. లబ్ధిదారుల ఎంపిక ఇందిరమ్మ కమిటీల ద్వారా జరుగుతుంది. అనర్హుల తొలగింపు, అర్హులైన కొత్తవారికి అవకాశం కల్పిస్తారు. మే 5-7 తేదీల్లో ఇళ్ల మంజూరు ఉంటుంది.