తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగంగా సాగుతున్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. జూన్ 2-9 మధ్య వారానికి సబంధించి లబ్ధిదారులకు రూ.22.64 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. ఈ వారం 1,549 ఇళ్లు బేస్‌మెంట్ వరకు, 481 గోడల వరకు, 117 స్లాబ్ వరకు పూర్తయ్యాయన్నారు. ప్రతి సోమవారం నిధులు విడుదల చేస్తున్నామని లబ్ధిదారులు 400-600 చదరపు అడుగుల్లో తమకు నచ్చినట్లు ఇళ్లు నిర్మించుకోవచ్చునని చెప్పారు.