IPS Ranganath: హైదరాబాద్ నగరంలో గత కొన్ని రోజులుగా హైడ్రా పేరు మారుమోగిపోతోంది. అక్రమ కట్టడాలను బుల్డోజర్లతో కూల్చేస్తున్న ఈ హైడ్రా అధికారులు.. నటుడు అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను కూల్చి వేయడంతో అందరి చూపు హైడ్రా వైపు మళ్లింది. ఈ క్రమంలోనే తర్వాత ఎవరి మీద హైడ్రా కన్ను పడుతుందోనని.. అక్రమ కట్టడాలు కట్టిన వారిలో భయం నెలకొంది. తాజాగా మాజీ మంత్రి మల్లారెడ్డి ఇలాఖాలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్.. పర్యటించడంతో నెక్స్ట్ టార్గెట్ అక్కడేనా అనే చర్చ జరుగుతోంది.