Janasena: మెగా ఫ్యామిలీ, అల్లు అర్జున్‌కు మధ్య ఉన్న వివాదాలు ఏంటో గానీ.. ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో రచ్చ లేపుతున్నారు. ఈ క్రమంలోనే జనసేన నేతలు కూడా అల్లు అర్జున్ మీద తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. అసలు పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ మధ్య ఏ స్థాయి వివాదం ఉందో గానీ.. వాళ్ల ఫ్యాన్స్, నేతలు మాత్రం.. ఒకరిపై మరొకరు తీవ్ర వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్‌ను ఉద్దేశించి జనసేన నేత చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. అల్లు అర్జున్ హీరో కాదంటూ కమెడియన్ అంటూ ఆ నేత తీవ్ర వ్యాఖ్యలు చేశారు.