జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి భేటీ అయ్యారు. తనయుడు ప్రణీత్ రెడ్డితో కలిసి మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పవన్ కళ్యాణ్‌ను కలిశారు బాలినేని. ఈ సందర్భంగా గంటన్నర పాటు వివిధ అంశాలపై చర్చించారు. మరో నాలుగు రోజుల తర్వాత మళ్లీ కలుద్దామని పవన్ కళ్యాణ్ బాలినేనికి సూచించినట్లు తెలిసింది. జనసేన పార్టీలో బాలినేని శ్రీనివాస రెడ్డికి తగిన ప్రాధాన్యం లభించడం లేదనే అభిప్రాయాల మధ్య.. ఈ భేటీ ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.