తెలంగాణ ప్రముఖ యూనివర్సిటీల్లో ఒక్కటైన జేఎన్టీయూ.. కీలక ప్రకటన చేసింది. గతంలో ఉన్న పాత విధానాన్నే మరోసారి అమల్లోకి తీసుకొచ్చింది. ప్రతినెలా నాలుగో శనివారాన్ని సెలవు దినంగా ప్రకటించింది. ఈ మేరకు గురువారం (ఫిబ్రవరి 20న) రోజున జేఎన్‌టీయూ రిజిస్ట్రార్ కె.వెంకటేశ్వర రావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నాలుగో శనివారం సెలవు దినం ఉత్తర్వులు ఈ నెల నుంచే అమల్లోకి వస్తుండగా.. 22వ తేదీన శనివారం హాలీడే అమల్లోకి రానుంది.