వైఎస్ఆర్ జిల్లాలో ఆదివారం రహదారులు నెత్తురోడాయి. వేర్వేరు చోట్ల జరిగిన ప్రమాదాల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. అంత్యక్రియలు వెళ్లి వస్తూ నలుగురు, తిరుమలకు వెళ్తూ ఇద్దరూ రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందారు. గువ్వలచెరువు ఘాట్ రోడ్డు వద్ద కారు, కంటైనర్ ఢీకొన్న ఘటనలో కంటైనర్ డ్రైవర్‌తో పాటుగా కారులోని నలుగురు చనిపోయారు. దువ్వూరు మండలంలో కారు అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో ఇద్దరు చనిపోగా.. ఐదుగురికి గాయాలయ్యాయి.