Kalyan Ram Tirumala: తిరుమల శ్రీవారి సేవలో కళ్యాణ్ రామ్, విజయశాంతి

1 week ago 3
‘అర్జున్‌ సన్‌ ఆఫ్‌ వైజయంతి’ చిత్రబృందం దర్శించుకుంది. గురువారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో నందమూరి కల్యాణ్‌ రామ్‌, నటి విజయశాంతి, దర్శకుడు ప్రదీప్‌ చిలుకూరి స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ‘అర్జున్‍ సన్‌ ఆఫ్‌ వైజయంతి’ చిత్రం ప్రేక్షకుల మనసుల్ని హత్తుకుంటుందని నటుడు కళ్యాణ్ రామ్‌ అన్నారు. ఈ సినిమాని అందరూ తల్లిదండ్రులతో కలిసి చూడాలని కోరారు. విజయశాంతి తల్లీ కుమారులుగా నటించిన ఈ సినిమా ఏప్రిల్‌ 18న విడుదల కానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో భాగంగా కల్యాణ్‌ రామ్‌ తిరుపతిలో సందడి చేశారు.
Read Entire Article