‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ చిత్రం ప్రేక్షకుల మనసుల్ని హత్తుకుంటుందన్నారు నటుడు కల్యాణ్ రామ్. తల్లీకొడుకుల మధ్య సంఘర్షణతో చాలా సినిమాలు వచ్చాయి.. కానీ, ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ లాంటి సినిమా ఇప్పటి వరకు రాలేదన్నారు. ఆయన, విజయశాంతి తల్లీ కుమారులుగా నటించిన ఈ సినిమా ఏప్రిల్ 18న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా కల్యాణ్ రామ్ తిరుపతిలో సందడి చేశారు. ఈ సినిమాని అందరూ తల్లిదండ్రులతో కలిసి చూడాలని కోరారు.