విజయవాడ కనకదుర్గమ్మ ప్రసాదంలో వెంట్రుక కనిపించడం కలకలం రేపింది. ఓ భక్తుడికి ఇలాంటి అనుభవం ఎదురైంది. దీంతో దుర్గ గుడి ప్రసాదంలో నాణ్యత లేదంటూ ఆ భక్తుడు సోషల్ మీడియాలో ఈ ఫోటోలను పంచుకున్నారు. తన ఫిర్యాదు దేవాదాయ శాఖ మంత్రికి చేరాలనే ఉద్దేశంతో ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని ట్యాగ్ చేశారు. దీంతో భక్తుడి ఫిర్యాదుపై రామనారాయణరెడ్డి స్పందించారు. జరిగిన దానిపై క్షమాపణలు తెలిపారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తానని హామీ ఇచ్చారు.