తెలంగాణతో పాటు దేశ విదేశాల్లో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పలువురు ప్రముఖులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సీఎం రేవంత్ కూడా కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్థిల్లాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు.