ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీపై సంచలన కామెంట్లు చేశారు. బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం కావడం ఖాయమన్నారు. బీఆర్ఎస్ పార్టీకి నలుగురు రాజ్యసభ సభ్యులున్నారని.. పార్టీ విలీనంతో తొలుత కవితకు బెయిల్ వస్తుందన్నారు. కేసీఆర్‌కు గవర్నర్ పదవి, కేటీఆర్‌కు కేంద్ర మంత్రి పదవి, హరీశ్‌రావుకు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత పదవి ఇస్తారిని రేవంత్ జోశ్యం చెప్పారు.