KCR: బీఆర్ఎస్ నేతలపై ఆ పార్టీ అధినేత కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు.. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడానికి కారణం పార్టీ నేతలే అని మండిపడ్డారు. ఇక పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు తప్పదని తెలిపారు. తెలంగాణలో త్వరలోనే ఉపఎన్నికలు రానున్నాయని జోస్యం చెప్పిన కేసీఆర్.. ఆ ఎన్నికలకు బీఆర్ఎస్ సర్వం సిద్ధంగా ఉండాలని సూచించారు. 2028 ఎన్నికల్లో తెలంగాణలో అధికారం బీఆర్ఎస్‌దేనని కేసీఆర్ స్పష్టం చేశారు.