Khairatabad Ganesh: ఈ ఏడాది 69 అడుగులతో గణనాథుడు.. స్పెషల్ ఏంటంటే..

1 year ago 36
ఖైరతాబాద్ గణపతి ఈ ఏడాది 69 అడుగుల ఎత్తున ‘శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి’గా దర్శనమివ్వనున్నాడు. 1954లో ఒక అడుగుతో మొదలైన ఈ విగ్రహం.. ఏటా పెరుగుతూ వచ్చింది. గతేడాది లక్షల మంది సందర్శించగా.. ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం. కర్రపూజ నాడే విగ్రహ నమూనా విడుదల కావడం ఇదే తొలిసారి. విగ్రహం మూడు తలలతో.. ఎనిమిది చేతులతో, దిగువన పూరీ జగన్నాథ స్వామి, శ్రీ లలితా త్రిపురసుందరి విగ్రహాలతో ఉంటుంది. మండపంలో హయగ్రీవ స్వామి, గజ్జలమ్మ కొలువుదీరుతారు. భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Read Entire Article