Kinjarapu Atchannaidu review on Rayalaseema Agriculture: కరవు పరిస్థితులతో ఇబ్బందులు పడుతూ సాగుకు దూరమవుతున్న రాయలసీమ జిల్లాల రైతులకు ప్రభుత్వం ఊరట కలిగించేలా నిర్ణయం తీసుకుంది. రాయలసీమలో సాగును ప్రోత్సహించేందుకు విత్తనాలను 80 శాతం రాయితీతో అందించాలని నిర్ణయించింది. రాయలసీమ జిల్లాలలో సాగుపై అధికారులతో సమీక్షించిన వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు.. ఈ మేరకు 80 శాతం రాయితీతో విత్తనాలు అందించాలని అధికారులను ఆదేశించారు.దీనిపై ఒకట్రెండు రోజుల్లో చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.