మాజీ మంత్రి కొడాలి నానికి ఏపీ హైకోర్టులో ఊరట దక్కింది. కొడాలి నానిపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దంటూ ఏపీ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. చంద్రబాబు, నారా లోకేష్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ విశాఖపట్నంలో గతేడాది నవంబర్‌లో కొడాలి నానిపై కేసు నమోదైంది. ఈ కేసును క్వాష్ చేయాలంటూ కొడాలి హైకోర్టును ఆశ్రయించగా.. పిటిషన్ విచారించిన హైకోర్టు, కొడాలి నానిపై తొందరపాటు చర్యలు వద్దంటూ ఆదేశించింది.