వైఎస్ జగన్ భద్రత వ్యవహారం టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధానికి కారణమవుతోంది. వైఎస్ జగన్ సెక్యూరిటీ కుదించారంటూ సోమవారం మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. అలాగే కూటమి ప్రభుత్వంపైనా ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ హైకోర్టులో వేసిన పిటిషన్ మీద, పేర్ని నాని వ్యాఖ్యలపైనా మంత్రి కొల్లు రవీంద్ర కౌంటర్ ఇచ్చారు. వైఎస్ జగన్‌కు ముఖ్యమంత్రి స్థాయి సెక్యూరిటీ కావాలంటే ఎలా అని ప్రశ్నించారు. పులివెందుల ఎమ్మెల్యేకి ప్రధాని రేంజులో సెక్యూరిటీ ఉండదనే విషయం గుర్తించాలని కౌంటర్ ఇచ్చారు.