బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కుటుంబంలో ఇప్పటికే గొడవలు మొదలయ్యయాని.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష నాయకుడి పదవి తనకొద్దని కేసీఆర్ వదిలేశారని.. ఆ పదవి కోసం కేటీఆర్, హరీష్ రావు కొట్టుకుంటున్నారంటూ కోమటిరెడ్డి ఆరోపించారు. ఇక.. ఇంటలీజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు.. హైదరాబాద్‌కు వస్తే మాత్రం కేటీఆర్, హరీష్ రావు జైలుకు వెళ్లటం ఖాయమని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.