హైదరాబాద్ కేపీహెచ్‌బీలో బుధవారం జరిగిన హౌసింగ్‌బోర్డు స్థలాల వేలంలో రికార్డు స్థాయి ధర పలికింది. 18 ఇళ్ల స్థలాలను 87 మంది పోటీదారులు దక్కించుకున్నారు. మొత్తం 6,236.33 గజాల స్థలాలు విక్రయించగా.. రూ.141.36 కోట్ల ఆదాయం సమకూరింది. గజానికి అత్యధికంగా రూ.2.98 లక్షలు పలికింది. ఈ డిమాండ్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుందని సూచిస్తోంది.