హైదరాబాద్ కూకట్‌పల్లి వడ్డేపల్లి ఎంక్లేవ్‌లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఓ కారు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా రెండేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిని గమనించకుండా పార్కింగ్ చేసిన కారును ముందుకు తీయటంతో అద్రితి (2) అనే చిన్నారి తీవ్రంగా గాయపడింది. చిన్నారి పైనుంచి కారు తోలటంతో తీవ్రంగా గాయపడింది. ఈనెల 16న ఈ ఘటన చోటు చేసుకున్న చిన్నారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఈనెల 20న చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఘటన సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు కాగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.