పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవంలో కూలిపోయిన సినిమా చెట్టును డైరెక్టర్ వంశీ పరిశీలించారు. ఈ సినిమా చెట్టుతో వంశీ ప్రత్యేక అనుబంధం ఉంది. దీంతో కూలిపోయిందనే విషయం తెలియగానే ఆయన.. సినిమా చెట్టును పరిశీలించేందుకు వచ్చారు. ఈ చెట్టుతో ఉన్న అనుబంధాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు. ఈ చెట్టు వల్ల కుమారదేవం గ్రామానికే పేరు వచ్చిందన్నారు. అయితే ఈ చెట్టును బతికించేందుకు ప్రయత్నాలు కూడా మొదలయ్యాయి.