ఏపీలో మద్యం ధరలు పెరిగిన సంగతి తెలిసిందే. క్వార్టర్ 99 రూపాయలకు అందిస్తున్న బ్రాండ్లు, బీర్లు మినహా మిగతా అన్ని బ్రాండ్ల ధరలను ప్రభుత్వం పెంచింది. బాటిల్ మీద పది రూపాయలు పెంచుతూ ఏపీ ఎక్సైజ్ శాఖ సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో మద్యం ధరల పెంపుతో ఎంత ఆదాయం వస్తుందనే వివరాలను ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వివరాలు వెల్లడించారు. బాటిల్ మీద పది రూపాయల పెంపుతో ఏపీ ప్రభుత్వానికి వంద కోట్ల నుంచి రూ.150 కోట్ల వరకూ ఆదాయం రావొచ్చని అంచనా వేశారు.