Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేవారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఇప్పటివరకు ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే.. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత విధించే నిబంధనను చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఎత్తివేసింది. దీంతో ఇద్దరి కంటే ఎక్కువ మంది సంతానం ఉన్న వారు కూడా స్థానిక సంస్థల్లో పోటీ చేసేందుకు అనుమతినిస్తూ ఏపీ మంత్రివర్గం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.